రీసెంట్ గా ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ షేర్ చేసి అభిమానులను షాక్ కి గురి చేసింది. ఆమె గర్భవతిగా ఉందా? పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆ తర్వాత ప్రెగ్నెన్సీకి సంబంధించిన ఓ వీడియోను షేర్ చేయడంతో.. ఆమె నెక్ట్స్ ప్రాజెక్ట్స్ ప్రమోషన్ లో భాగంగా ఇలాంటి ఆసక్తికర పోస్ట్ లు షేర్ అవుతున్నాయి.
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నిత్యా మీనన్ స్థానం ప్రత్యేకమైనది. హీరోయిన్ పాత్ర ప్రాధాన్యం.. కంటెంట్ చూసుకుని సినిమాలను ఎంచుకుంటుంది. ఈ ఏడాది స్కైలాబ్, భీమ్లానాయక్ వంటి చిత్రాలతో అలరించిన నిత్య.. గత కొన్ని రోజులుగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షాకింగ్ పోస్ట్‌లను షేర్ చేస్తూనే ఉంది. రీసెంట్ గా ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ షేర్ చేసి అభిమానులను షాక్ కి గురి చేసింది. ఆమె గర్భవతిగా ఉందా? పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి.
ఆ తర్వాత ప్రెగ్నెన్సీకి సంబంధించిన ఓ వీడియోను షేర్ చేయడంతో.. ఆమె నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ప్రమోషన్ లో భాగంగా ఇలాంటి ఆసక్తికర పోస్ట్ లు షేర్ అవుతున్నాయి. తాజాగా మరోసారి తన ప్రెగ్నెన్సీ గురించిన సమాచారాన్ని తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది.
తన బేబీ బంప్ ఫోటోలను షేర్ చేస్తూ, "గర్భధారణ ఎప్పుడూ మెరుగ్గా కనిపించదు" అని క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వండర్ ఉమెన్ వెబ్ సిరీస్‌లో నిత్య నటించనుంది. ఈ లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నిత్యతో పాటు తమిళ హీరోయిన్ పార్వతి తిరువోతు కూడా నటిస్తోంది. ఈ సిరీస్‌లో అంజలి మీనన్ నటించిన ఇది నవంబర్ 18 నుండి ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్ సోనీ లైవ్‌లో ప్రసారం కానుంది.
ఈ సిరీస్‌ని రోనీ స్క్రూవాలా, ఆషి దువా సారా నిర్మించగా.. నదియా మరియు పద్మప్రియ ప్రధాన పాత్రలు పోషించారు. నిత్య తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం, హిందీ సినిమాల్లో కూడా నటించింది.