ఢిల్లీ : ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత రైతులు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టారు.తమ ఉద్యమం ప్రారంభమై మూడేళ్లు పూర్తయిన సందర్భంగా దేశ రాజధానిలో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని రైతులు నిర్ణయించారు. ఇందులో భాగంగా 'ధరణికోట నుంచి ఎర్రకోట' పేరుతో ప్రత్యేక రైలులో రైతులు ఢిల్లీ చేరుకున్నారు.
రైతుల ఆందోళనకు టీడీపీ, కాంగ్రెస్, జనసేన, సీపీఐ నేతలు మద్దతు తెలిపారు. సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా, రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, టీడీపీ ఎంపీలు గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు, ఏఐసీసీ కార్యదర్శి జెడి శీలం, ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగుడ్రరాజు, వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు, టీడీపీ మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్, జనసేన సంగం హరిప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు.
పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో రేపు, రేపు పలు పార్టీల నేతలతో అమరావతి రైతులు సమావేశం కానున్నారు. మూడు రాజధానుల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం నడుస్తున్న తీరు... అమరావతి ప్రాంత రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని వారికి వివరించనున్నారు. సోమవారం రాంలీలా మైదానంలో భారతీయ కిసాన్ సంఘ్ ర్యాలీలో రైతులు పాల్గొంటారు. భారతీయ కిసాన్ సంఘ్ తన సమావేశంలో అమరావతి రైతాంగ ఉద్యమాన్ని ప్రత్యేక అజెండాగా చేర్చింది.
RECENT POST:-
Mishti Chakraborty In Saree Picsఢిల్లీ ఎయిమ్స్ సర్వర్లపై దాడి చైనా హ్యాకర్ల పనే..!